అయ్య బాబోయ్.. ఇదేం బౌలింగ్.. ఫాన్స్ షాక్?
ఇకపోతే బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇటీవల బ్రిస్బేన్ స్టార్ బౌలర్ లియామ్ గుత్రి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు పాలు అవుతున్నాడు. మెల్బోర్న్ స్టార్స్ బ్రిస్బేన్ హిట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో స్టార్ బౌలర్ లియామ్ గుత్రి నాలుగు ఓవర్లు వేశాడు. ఇక నాలుగు ఓవర్లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు బౌలర్. అయితే ఇప్పటివరకూ ఈ సీజన్లో కాదు దాదాపు బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే ఇంత అత్యధిక పరుగులు ఏ బౌలర్ ఇవ్వలేదు అని చెప్పాలి. ఇలా ఏకంగా 4 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి సరికొత్త చెత్త రికార్డును నమోదు చేశాడు. అంతేకాదండోయ్ నాలుగు ఓవర్లలో కాస్త ఎక్కువగా పరుగులు చేసినప్పటికీ రెండు వికెట్లు పడగొట్టడం మాత్రం అందరికీ ఉపశమనాన్ని కలిగించింది అని చెప్పాలి.
ఏదేమైనా స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న లియామ్ గుత్రి ఇలా 70 పరుగులు సమర్పించుకోవడం ఏంటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక అంతకుముందు బిగ్ బాష్ లీగ్ లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నా చెత్త రికార్డు సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయుష్ పైన ఉండేది. అతను గతంలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ లోకి వెళితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు మొదట్లోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముఖ్యంగా కెప్టెన్ మాక్స్వెల్ అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే ఈ మ్యాచ్లో పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తంగా 207 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హిట్ జట్టు 20 ఓవర్లలో కేవలం 187 పరుగులు మాత్రమే చేసి చివరికి ఓటమి చవిచూసింది.