షాకింగ్ : ఆరుగురికి కరోనా.. సిరీస్ రద్దవుతుందా?
ఇలా ఒక వైపు ఇంగ్లాండ్ జట్టు వరుస ఓటమిని చవి చూస్తున్న నేపథ్యంలో మరో వైపు కరోనా వైరస్ పగ పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. వరుసగా ఇంగ్లండ్ జట్టులో సిబ్బందికి వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓటమి అంచుల దగ్గర ఊగిసలాడుతుంది ఇంగ్లాండ్ జట్టు. ఇలాంటి సమయంలో అటు కరోనా వైరస్ కూడా ఇంగ్లండ్ జట్టుపై పగ పెట్టినట్లు గానే వ్యవహరిస్తోంది. ఇంగ్లాండ్ క్యాంపు లో మొత్తం ఆరుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే ఇప్పుడు వరకు అటు ఆటగాళ్లు ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదు.
ఇకపోతే వరుసగా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి ముందు ఊగిసలాడుతోంది ఇంగ్లండ్ జట్టు. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ కేసులు కూడా వెలుగులోకి రావడంతో ఈ సిరీస్ కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇంగ్లాండ్ జట్టు లో అటు ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఒక్కరు కూడా సరైన ప్రదర్శన చేయలేక పోతున్నారు. ఎవరో ఒకరు బాగా రాణించినప్పటికి ఆ తర్వాత మాత్రం పేకమేడలా ఇంగ్లాండ్ జట్టు వికెట్లు కోల్పోతు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్లపై అటు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.