కెప్టెన్సీ విషయంలో.. ధోని అలా చెప్పడంతో షాక్ అయ్యాం : రవి శాస్త్రి
అయితే మహేంద్ర సింగ్ ధోనీ 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న సమయంలో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన ఘటన ఇటీవలే భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్రసింగ్ ధోని షాకింగ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా సిరీస్ ను డ్రా గా ముగించింది. ఈ క్రమంలోనే అప్పుడు డైరెక్టర్గా ఉన్న నాతో వచ్చి ఆటగాళ్లందరూ అని పిలవాలని మహేంద్ర సింగ్ ధోనీ చెప్పా.డు ఇక మ్యాచ్ డ్రాగా ముగించి నందుకు ఆటగాళ్లు అందరితో ఏదైనా చెబుతాడేమో అనీ అనుకున్నాం అందరం. కానీ ఎంతో తేలిక నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్న అంటూ చెప్పాడు ఆ సమయంలో ఆటగాళ్ళ వైపు చూశాను అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ ఒక్కసారి ధోని నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇక రెండో ఆలోచన లేకుండా ముందుకు వెళతాడు. ఈ క్రమంలోనే అప్పుడు కెప్టెన్సీ గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండడం వలన విరాట్ కోహ్లీ కెప్టెన్సి రావాలని ధోని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయాలు చెప్పుకొచ్చారు రవి శాస్త్రి.