'డమ్మీ ద్రావిడ్'.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?
అయినప్పటికీ అటు బీసీసీఐ మాత్రం అతనికి అవకాశం కల్పిస్తూ వస్తుంది.. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా టెస్ట్ జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు చటేశ్వర్ పుజారా. ఇక తుది జట్టులో కూడా అవకాశం దక్కించుకోవడం గమనార్హం కానీ ఇక ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడిన తీరు మాత్రం అభిమానులందరినీ కూడా నిరాశ పరిచింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడీ వేసిన బౌలింగ్లో గోల్డెన్ డక్ గా పెవీలియన్ చేరాడు పూజారా. ఆడిన తొలి బంతికే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పూజారా. ఎంతో డిఫెన్స్ తో ఆడుతూ అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు.
కానీ ఇలా ఓకే బంతికి గోల్డెన్ డక్ గా వెనుదిరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపై సిద్దేశ్వర్ పూజారా గోల్డెన్ డక్ గా వెనుదిరగడం ఇది రెండవసారి. అంతే కాదు రెండు సార్లు కూడా ఎంగిడీ బౌలింగ్లోనే పూజారా అవుట్ కావడం గమనార్హం. ఒక్క పరుగు కూడా చేయకుండానే రనౌట్ రూపంలో గతంలో గోల్డెన్ వెనుదిరిగాడు. ఇకపోతే పూజారా చెత్త ప్రదర్శనపై ప్రస్తుతం ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. భారత టెస్ట్ క్రికెట్ లో నువ్వు మరో ద్రావిడ్ అంటూ ఊహించుకున్నాము.. కానీ మా ఆశలు ఆవిరయ్యాయి... నువ్వు డమ్మీ ద్రవిడ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతూ భారత క్రికెట్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.