టీమిండియా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అతను వచ్చేస్తున్నాడు?
ఇటు కెప్టెన్ గా ఎన్నికైన తర్వాత రోహిత్ శర్మ అటు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఎలా రాణించ పోతున్నారు అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో రోహిత్ శర్మ గాయం బారినపడి జట్టు కు దూరం కావడం అభిమానులందరినీ నిరాశపరిచింది. అయితే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ ఆడపోతుండగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న టెస్ట్ ఫార్మాట్ కి రోహిత్ శర్మ దూరం కావడం సంచలనంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ టెస్ట్ ఫార్మాట్కు దూరమయ్యాడు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే గాయం బారిన పడిన రోహిత్ శర్మ కనీసం వన్డే ఫార్మాట్ కైనా అందుబాటులో ఉంటాడ ఉండడా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే గాయంతో టెస్ట్ క్రికెట్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ సౌతాఫ్రికాలో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీలో రోహిత్ ప్రైమరీ ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం మరోసారి రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ లకు హాజరు కాబోతున్నాడు. ఇక ఈ పరీక్షలో సక్సెస్ అయ్యాడు అంటే వన్డే సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు అనే చెప్పాలి. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం ఎంపికైన వన్డే జట్టులో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ లో రాణించిన రుతురాజ్, వెంకటేష్ అయ్యర్ లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.