ఇద్దరు బౌలర్లు.. రెండు రికార్డులు?

praveen
క్రికెట్ లో అరుదైన రికార్డు సాధించడానికి ప్రతి ఒక ఆటగాడు ఎప్పుడూ తీవ్రంగా శ్రమిస్తు ఉంటాడు. అయితే క్రికెట్ లో రికార్డు సాధించడం అంటే కేవలం ఒక్క మ్యాచ్ తో సరిపోయేది కాదు కదా. ప్రతి మ్యాచ్ లో ఎంతో నిలకడగా రాణిస్తూ మంచి ప్రదర్శన చేసినప్పుడే రికార్డులు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించడానికి క్రికెట్ ఆటగాళ్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే రేపు సౌతాఫ్రికాతో టీమిండియా  ఆడబోయే టెస్ట్ సిరీస్లో కూడా పలువురు భారత బౌలర్లు అరుదైన రికార్డులు పై కన్నేశాడు అని చెప్పాలి.


 ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా జట్టు. ఇక మొదట సౌత్ఆఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. సెంచరియన్ వేదిక జరగబోతున్న బాక్సింగ్ డే టెస్టు లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో ఇక ఈ టెస్ట్ సిరీస్ లో అరుదైన రికార్డును తమ ఖాతలో వేసుకోవడానికి అటు ఎంతో మంది భారత ఆటగాళ్లు కూడా ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. వీరిలో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమిలు కూడా ఉన్నారు.


 టీమిండియాలో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ భారత మాజీ ఆటగాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డు పై గురి పెట్టాడు. ఇప్పుడు వరకు 81 టెస్టుల్లో 427 వికెట్లు పడగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ 434 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందున్నాడు. ఈ క్రమంలోనే సఫారీల తో జరగబోయే టెస్టు సిరీస్లో మరో ఏడు వికెట్లు తీసి అటు కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్.  అదేసమయంలో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఇక సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అరుదైన మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు 54 టెస్ట్ మ్యాచ్లు ఆడిన మహ్మద్ షమీ 195 వికెట్లు తీసుకున్నాడు. ఇక రేపు జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీస్తే 200 మైలురాయిని అందుకుంటాడు షమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: