అతను సెలక్టర్ల దృష్టి లో ఉన్నాడు : ఆకాష్ చోప్రా
ఈ క్రమంలోనే ప్రస్తుతం రుతు రాజ్ గైక్వాడ్ ఉన్న ఫామ్ చూస్తే దక్షిణాఫ్రికా పర్యటనకు సెలెక్టర్లు ఎప్పుడైనా అతన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో రుతు రాజ్ గైక్వాడ్ తప్పకుండా చేరుతాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే భారత సెలెక్టర్లు దృష్టి అతనిపై పడింది అని అంటున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా. రుతు రాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తూ ఉండడం పై ప్రశంసల వర్షం కురిపించాడు.
విజయ్ హజారే ట్రోఫీ లో రుతు రాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఏ బౌలర్ కు భయపడకుండా ఆడుతున్నాడు. వరుసగా సెంచరీలు కూడా చేయగలుగుతున్నాడు. అతని వికెట్ తీయడానికి ప్రస్తుతం బౌలర్లు ఎంతగానో కష్టపడి పోతున్నారు. ఫాస్ట్ పేస్ బౌలింగ్ లో స్వీప్ షాట్లు ఆడటం అతను ఒక్కడికే సాధ్యం అయింది అని చెప్పాలి. ఇక ఈ సీజన్లో అద్భుతంగా రుతు రాజ్ గైక్వాడ్ రాణిస్తున్నాడు. అతను చేస్తున్న పరుగుల నేపథ్యంలో ఇప్పటికే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇలా ఆకాష్ చోప్రా చెప్పిన దాని ప్రకారం ఏ క్షణంలోనైనా సెలక్టర్లు అతని సౌత్ ఆఫ్రికా పర్యటనకు సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.