బౌలర్ వింత సెలబ్రేషన్.. అవాక్కయిన బ్యాట్స్మెన్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించినట్లు గానే అటు ప్రతి దేశంలో కూడా ఆయా క్రికెట్ బోర్డు దేశీ క్రికెట్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇక ఈ లీగ్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఇటీవలే ఒక మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక ప్రీమియర్ లీగ్లో భాగంగా క్యాండీ వారియర్స్ డంబుల్లా జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.


 ఇక ఈ మ్యాచ్లో క్యాండీ వారియర్స్ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌలర్లు  వికెట్ తీస్తే కొంతమంది కాస్త వింతగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో కూడా కాండీ వారియర్స్ బౌలర్ బినుర ఫెర్నాండో వింతైన సెలబ్రేషన్స్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక బౌలర్ సెలబ్రేషన్స్ తో  వికెట్ కోల్పోయిన బ్యాట్స్మెన్ అయితే ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఇలా ఫెర్నాండో వింత సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఎంతో తెలివిగా బౌలింగ్ చేసి డంబుల్లా జాయింట్స్ బ్యాట్స్మెన్  ఫిలిప్ సాల్ట్ ను బోల్తా కొట్టించి వికెట్ తీసుకున్నాడు..  వికెట్ తీసిన ఆనందంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఫెర్నాండో. యూట్యూబ్ లో ఎంతగానో ఫేమస్ అయిన సాల్ట్ బే సెలెబ్రేషన్స్ ను తనదైన శైలిలో మైదానంలో చేసి చూపించాడు. అయితే అవుట్ అయిన బ్యాట్స్మెన్ పేరు ఫిలిప్ సాల్ట్ కావడంతో ఇలా సాల్ట్ బె రూపంలో బౌలర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని అందరు అనుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ తో ఆశ్చర్యపోయిన బ్యాట్స్మెన్ నన్నే  కామెంట్ చేస్తున్నాడు అన్నట్లుగా గమనిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: