వైరల్ : భారీ సిక్స్.. అభిమాని తల పగిలిపోయింది?
కానీ చివరికి సీన్ రివర్స్ అయ్యింది. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన సదరు వ్యక్తి తల పగిలి పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. బిగ్ బాష్ లీగ్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే పెర్త్ స్కార్చర్, హోబార్ట్ హర్రికేనెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈక్రమంలోనే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లు అండ్రు బౌలింగ్లో బ్యాట్స్మెన్ మెక్ డోర్ మేట్ భారీ సిక్సర్ కొట్టాడు. అయితే గాల్లో నుంచి స్టాండ్స్ లోకి దూసుకు వస్తున్న బంతిని పట్టుకోవాలని ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు.
అయితే అతను ఆ బంతిని క్యాచ్ పట్టు కోలేదు చివరికి ఆ బంతి అతని తల పై బలం గా తగలడంతో తల పగిలి నంత పని అయ్యింది. బంతి బలంగా తగలడం తో సదరు అభిమాని ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు. చూస్తూ చూస్తుండ గానే నుదుటి నుంచి రక్తం కారడం కూడా మొదలైంది. ఇది చూసిన తోటి ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.. ఇక వెంటనే అతన్ని వైద్యుల దగ్గరికి పంపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు.