కుమ్మేసాడు : క్రికెట్ లో సంచలనం.. తెలుగు కుర్రాడి విధ్వంసం?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస సెంచరీలతో అదరగొట్టాడు. అదే సమయంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ అయ్యర్ కూడా అద్భుతమైన శతకాలు చేసి అందరిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు ఆర్సిబి ఆటగాడు తెలుగు ప్లేయర్ కె ఎస్ భరత్ కూడా తన బ్యాటింగ్తో ఔరా అనిపించాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుతంగా రాణించి ఏకంగా 161 పరుగులు సాధించాడు కె ఎస్ భరత్.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన మ్యాచ్లో 109 బంతుల్లో పదహారు బౌండరీలు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిపోయాడు. మొత్తంగా 161 పరుగులు సాధించాడు. అయితే ఈ తెలుగు ప్లేయర్ ఒక్కసారిగా విజృంభించి శతక్కొట్టడంతో ఇక మెగా వేలం కి ముందు ఫ్రాంఛైజీల చూపు మొత్తం అతనిపై పడింది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో బేస్ ధర 20 లక్షలు మాత్రమే పలికిన భరత్ ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉండడంతో అతనికి ఎంతో భారీ ధర పలికే అవకాశం ఉంది.. అయితే ఈ ఆటగాడు వికెట్కీపర్ కమ్ బ్యాట్స్మన్ కావడంతో అతనికి మరింత కలిసొచ్చే అవకాశం కూడా ఉంది.