
అతని పై ఆశలు వదులుకున్నాం : గంగూలీ
అయితే రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించడంపై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హెడ్ కోచ్ గా ఉండడానికి రాహుల్ ద్రావిడ్ ను ఒప్పించడం ఎంతో కష్టతరమైనది అంటూ చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో ఆశలు కూడా వదులుకున్నాము అంటూ తెలిపాడు సౌరబ్ గంగూలీ. శాస్త్రి తర్వాత భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమించాలని నేను జైషా ఎన్నో రోజుల క్రితం అనుకున్నాం ఈ విషయాన్ని సహచర ఆటగాడు రాహుల్ ద్రావిడ్ తో చర్చించాము కాని అతడు టీమిండియా హెడ్ కోచ్ గా ఉండడానికి నిరాకరించాడు.
అతనికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ఇక కుటుంబానికి దూరంగా ఉండటం కష్టం అంటూ చెప్పేశాడు. అయితే హెడ్ కోచ్ పదవి గురించి ఎన్నిసార్లు రాహుల్ ద్రవిడ్ తో చర్చించినప్పటికీ అతను మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఒకానొక సందర్భంలో ఓపిక నశించి చివరికి రాహుల్ ద్రావిడ్ పై ఉన్న ఆశలు అన్నీ వదులుకున్నాము. కానీ పదే పదే అడగడం మాత్రం మానలేదు. చివరికి ఆటగాళ్లు కూడా రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ కావాలి అనడంతో చివరికి అంతా వివరించి రాహుల్ ద్రవిడ్ ను టీం ఇండియా కోచ్ గా ఉండేందుకు ఒప్పించానము అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.