మెగా వేలం.. ఆ జట్టుకు కెప్టెన్గా వార్నర్?

praveen
ప్రస్తుతం తెలుగు క్రికెట్ ప్రేక్షకులు అందరిలో కూడా ఒకటే చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించి ఏకంగా ఒక సారి ఐపీఎల్ టైటిల్ అందించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ తో కొనసాగుతారా లేదా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే సన్రైజర్స్ జట్టు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి జట్టును ఎంతోఅద్భుతంగా కెప్టెన్గా ముందుకు తీసుకెళ్ళాడు డేవిడ్ వార్నర్. జట్టులో స్టార్ ఆటగాల్లు లేక పోయినప్పటికీ  ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు సాగాడు.

 ఇక సన్రైజర్స్ జట్టు కెప్టెన్గా డేవిడ్ వార్నర్ కి తెలుగు ప్రజలకు మధ్య ఎంతో అనుబంధం కూడా ఏర్పడింది.  సన్రైజర్స్ అంటే డేవిడ్ వార్నర్.. డేవిడ్ వార్నర్ అంటే సన్రైజర్స్ అన్న విధంగా మారిపోయింది. ఇలాంటిసమయంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరు మాత్రం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఒకటి రెండు మ్యాచ్ లలో డేవిడ్ వార్నర్  రాణించక పోవడంతో   చివరికి సన్రైజర్స్ యాజమాన్యం అతని పక్కన పెట్టింది. కెప్టెన్సీ నుంచి తొలగించి జట్టులో కూడా స్థానం కల్పించలేదు. కనీసం ఒకానొక సమయంలో మైదానంలోకి కూడా రానివ్వలేదు.

 దీంతో ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం జరుగుతుండగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్ ను మెగా వేలంలో కి వదిలి పెడుతుంది. డేవిడ్ వార్నర్ లాంటి ఒక మంచి ఆటగాడిని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో డేవిడ్ వార్నర్ కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ జట్టులోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్ బ్రాడ్ హాగ్. డేవిడ్ వార్నర్ ను  జట్ట్టుల్లోకి తీసుకొని అహ్మదాబాద్ యాజమాన్యం కెప్టెన్గా డేవిడ్ వార్నర్ ను  నియమిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్,  ఆర్సిబి బౌలర్లు సిరాజ్, హర్షల్ పటేల్ లను కూడా అహ్మదాబాద్ తీసుకోబోతోంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: