రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమాని.. ఫోటో వైరల్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులు క్రికెటర్లను ఎంతో అమితంగా అభిమానిస్తా ఉంటారు. ఒక్కసారి తన అభిమాన క్రికెటర్ ని కలిస్తే చాలు అని భావిస్తూ ఉంటారు. ఒకవేళ ఇక కలిసే అవకాశం వచ్చింది అంటే చాలు మురిసిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఇక అవకాశం లేకపోయినప్పటికీ కూడాఏదో ఒక విధంగా కలవడానికి ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లను కలవడానికి ఎంతో మంది అభిమానులు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని పరుగులు పెడుతూ రావడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి .


 మైదానంలోకి పరుగులు పెడుతూ రావడంతో ఇక తమ అభిమాన క్రికెటర్లతో ఫోటోలు దిగడం లేదా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. ఇప్పటివరకు పలు మ్యాచ్ లలో ఇలా సెక్యూరిటీ సిబ్బందినీ దాటుకుని మరీ మైదానంలోకి పరుగులు పెట్టిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం టీమిండియా జట్టు స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ టి 20 సిరీస్ కు పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు.


 అయితే ఇక వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టి 20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఒక అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ పాదాలు తాకేందుకు ప్రయత్నించాడు ఆ అభిమాని. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ మీద పడుకొని నమస్కరించాడు. అటు వెంటనే స్టాండ్ వైపు పరుగులు తీశాడు.  ఇక దీనిపై ప్రస్తుతం నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా అయితే ఆటగాళ్ల భద్రత ఎక్కడ ఉంది అంటూ కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరికొంతమంది అభిమాని కల నెరవేరింది అంటూ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: