న్యూజిలాండ్ బౌలర్.. నా భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు : సూర్య కుమార్

praveen
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో సీనియర్ బౌలర్ గా కొనసాగుతున్నాడు  బౌల్ట్. ఇక కీలక సమయంలో వికెట్లు పడగొట్టి  న్యూజిలాండ్ జట్టుకు విజయాన్ని అందించడంలో ఎప్పుడూ కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు బౌల్ట్. ఇక తన బౌలింగ్లో ఏకంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు ముచ్చెమటలు పట్టించ గలడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో  ఉన్న అత్యుత్తమ బౌలర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు  బౌల్ట్. న్యూజిలాండ్ జట్టు లోనే కాదు అటు ఐపీఎల్ లో కూడా అదరగొడుతు  ఉంటాడు.ఇక ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో కూడా బౌల్ట్ ఎంతో అద్భుతంగా రాణించి న్యూజిలాండ్ జట్టు ఫైనల్కు చేరడంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.


 ఇకపోతే న్యూజిలాండ్ టీ-20 జట్టు ఇండియా పర్యటనకు రాగా.. ఈ జట్టులో కూడా కొనసాగుతున్నాడు బౌల్ట్. కాగా ఇటీవలే టీమిండియా తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో బాగా రాణించాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బౌలర్  బౌల్ట్ ఏకంగా భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భార్యకు బహుమతి ఇచ్చాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఏకంగా సూర్యకుమార్ యాదవ్. అదేంటి న్యూజిలాండ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భార్యకు బహుమతి ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. ఇంతకీ ఏం జరిగింది అంటే.. నిన్న న్యూజిలాండ్ భారత్ మధ్య ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్  సాగింది.



 మొదట ఎంతో దూకుడుగా ఆడింది భారత జట్టు. కానీ ఆ తర్వాత మాత్రం కేవలం 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే మూడవ స్థానంలో వచ్చిన కుమార్ యాదవ్ కు అద్భుతంగా రాణించాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు.  సూర్యకుమార్ యాదవ్ 57 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వ సిక్సర్ కొట్టబోయాడుమ్. కానీ అది టైం కుదరక చివరికి మైదానంలో  బౌల్ట్   చేతిలోకి వెళ్ళింది. కానీ ఆ క్యాచ్ ఒడిసి పట్టుకోలేకపోయాడు బౌల్ట్.. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన సూర్యకుమార్ యాదవ్ తన భార్య పుట్టినరోజు నాడు ఇచ్చిన బహుమతి ఇదే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: