చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు డేవిడ్ వార్నర్. ఎప్పుడు ఓపెనర్గా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి టి20 ఫార్మాట్లో ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇకపోతే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అతి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టు మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించడం లో డేవిడ్ వార్నర్ పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి.



 అయితే ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ గెలిచి ఏకంగా వార్నర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచినప్పటికీ కూడా.. వార్నర్ మనసులో మాత్రం ఒక బాధ తొలిచి వేస్తుంది అన్నది తెలుస్తుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదలైనప్పటి నుంచి వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడు.. జట్టుకు ఏకంగా ఒక సారి టైటిల్ కూడా అందించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒంటిచేత్తో  విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2021 సీజన్లో మాత్రం కాస్త పేలవ ప్రదర్శన చేయడంతో డేవిడ్ వార్నర్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది సన్రైజర్స్  యాజమాన్యం. కెప్టెన్గా తొలగించడమే కాదు తుది జట్టులో కూడా స్థానం కల్పించలేదు.



 దీంతో కేవలం వార్నర్ అభిమానులే కాదు క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఫీల్ అయ్యారు.  ఇక ఇటీవలే వార్నర్ మనసులో కూడా ఈ బాధ పోవడం లేదు అన్నది తెలుస్తుంది. ఇటీవల  జాతీయ మీడియాతో మాట్లాడిన డేవిడ్ వార్నర్ తన మనస్సులో మాట బయట పెట్టాడు.  కొన్నేళ్ల పాటు అమితంగా ఇష్టపడే  జట్టు ఉన్నట్టుండి ఏ తప్పు లేకుండా ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం కెప్టెన్సీ నుంచి తప్పించడం ఎంతో బాధ కలిగించింది. ఈ విషయం గురించి నేను ఎవరికీ ఎలాంటి ఫిర్యాదులు చేయాలి అని అనుకోవడం లేదు. భారత్లో కూడా నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. ఇక ప్రతి సమయంలో వారు నాకు అండగా నిలిచారు. అభిమానుల కోసమే నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. నన్ను తొలగించడానికి కారణం ఏదైనా కావచ్చు.. కానీ నేనైతే  ఫ్రాంచైజీ  కోసం నిరంతరం కష్టపడ్డా.. కానీ ఒక్కసారి పరుగులు చేయకపోవడంతో నన్ను తీసేయడం మాత్రం ఎంతో బాధ కలిగించింది. మరో ఐపీఎల్లో నాకు  అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అంటూ తన మనసులో బాధ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: