ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా

praveen
సాధారణంగా క్రికెట్ ఆటగాళ్ళ కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక క్రికెట్ ఆటగాల్లకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇక క్రికెట్ ఆటగాళ్ల గురించిన చిన్న విషయాన్ని పెద్దది గా చూపిస్తూ ఉంటారు అందరూ. కాగా ఈరోజు ఉదయం నుంచి ఇలా ఒక వార్త సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. అభిమానులందరినీ షాక్కి గురిచేస్తోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకూ కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు అంటూ ఓ వార్త వైరల్ గా మారిపోయింది.


 ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటికి టీమ్ ఇండియా బయలుదేరింది. ఆ సమయంలో హార్థిక్ పాండ్యా ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారని ఇక అతని వద్ద ఉన్న 5 కోట్ల రూపాయల విలువైన వాచ్  ను స్వాధీనం చేసుకున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. వాచ్ విలువ దాదాపు 5 కోట్ల వరకు ఉంటుంది అంటూ టాక్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పారు. ఇకపోతే ఇటీవల తనపై వస్తున్న వార్తలపై స్పందించారు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.


 దయచేసి తనపై తప్పుడు వార్తలు రాయొద్దు అంటూ కోరాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తన నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాచ్ విలువ 5 కోట్లు రూపాయలు కాదని 1.5 కోట్ల రూపాయలు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దుబాయిలో చట్ట ప్రకారమే ఈ వాచ్ కొనుగోలు చేశా అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఒక భారతదేశ పౌరుడిగా తాను చట్టాలను గౌరవిస్తా అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో అధికారులకు తన నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇప్పటికే కస్టమ్స్ అధికారులకు కావాల్సిన అన్ని పత్రాలు సమర్పించా అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: