ఆ క్రికెటర్నూ బూతులు తిడుతున్న ఫాన్స్.. ఎందుకో తెలుసా?
ఈ క్రమంలోనే ఇక పాకిస్థాన్ జట్టు గెలిచే మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకొచ్చిన పాకిస్థాన్ సెమీ ఫైనల్లో తడబడింది. చివరికి ఓడిపోయి ఇంటి బాట పట్టింది. అయితే సెమీఫైనల్లో గెలవాల్సిన పాకిస్థాన్ జట్టు ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం అన్నది అందరికీ తెలిసిందే. అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మాత్యు హెడ్.. అలాంటి ఆటగాడు 19వ ఓవర్లో క్యాచ్ ఇవ్వగా బౌండరీ దగ్గర ఉన్నా పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ క్యాచ్ మిస్ చేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే పాకిస్థాన్ జట్టు గెలిచి ఫైనల్ వెళ్లే అవకాశం ఉండేది. అతను ఆ క్యాచ్ మిస్ చేయడంతో ఆ తర్వాత విజృంభించిన మాత్యు హెడ్ 3 సిక్సర్లు కొట్టాడు.
దీంతో గెలవాల్సిన పాకిస్తాన్ కాస్త ఓటమి పాలు అయింది. అయితే పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ క్యాచ్ మిస్ చేయడంపై ప్రస్తుతం పాక్ క్రికెట్ అభిమానులు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ జట్టు అతని వల్లే ఫైనల్ చేరలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది అభిమానులు అయితే మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా దూషిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే కేవలం హసన్ అలీ మాత్రమే కాదు అతని భార్యను కూడా ఈ వ్యవహారంలో కి లాగి బూతులు తిడుతూ ఉండడం గమనార్హం. ఇలా పాకిస్తాన్ ఫాన్స్ తీరు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.