ఆ ఇద్దరి ఇండియన్ ప్లేయర్స్ పై వేటు పడనుందా?

VAMSI
టీ 20 వరల్డ్ కప్ 2021 లో భారత్ వైఫల్యానికి బాధ్యత ఎవరిది? అంటే సమాధానం ఉందా? ఏమో అది టీమిండియా యాజమాన్యానికి తెలియాలి. క్రికెట్ లో మనకు సాటి లేదు అనుకునే వాళ్లము. కానీ అంచనాలు అన్నీ తల క్రిందులు అయిపోయాయి. వరల్డ్ కప్ లో మనతో చెత్త రికార్డు ఉన్న పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం ఎంతో కృంగదీసింది. కానీ ఆటలో గెలుపు ఓటమి అనేవి సహజం అని ముందుకెళ్ళినా ఫలితం మాత్రం మారలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలోనూ ఓటమి పాలై సెమీస్ అవకాశాలను పోగొట్టుకుంది. అయితే ఈ రోజు తన చివరి మ్యాచ్ ఆడుతోంది. విజయంతో వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించాలని అంతా కోరుకుంటున్నారు. కానీ ఇండియా సెమీస్ లో లేదు అనే మాట తలుచుకుంటేనే బాధగా ఉంది.

ఈ ఎఫెక్ట్ తో టీమిండియా ఆటగాళ్లలో కొంత మందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు శార్దూల్ ఠాకూర్ కాగా మరొకరు వరుణ్ చక్రవర్తి అని అనుకుంటున్నారు. వీరిద్దరికీ దక్కినవి మామూలు అవకాశాలు కాదు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ని మిస్టరీ స్పిన్నర్ గా భావించి పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేకపోయినా కీలకమైన వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారు. సెలక్షన్ అయిన తర్వాత వరుణ్ ఎంపికపై భారీగా విమర్శలు వచ్చాయి. అనుభవం లేకుండా వరల్డ్ కప్ టీమ్ లో ఎందుకు తీసుకున్నారు. అతని కంటే చాహల్ మరియు కుల్దీప్ యాదవ్ లే నయం అంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్షన్ కమిటీ ని తూర్పారబట్టారు. అయితే ఈ విమర్శలు అన్నింటికీ తన ప్రదర్శన సమాధానం చెబుతుంది అని అనుకున్నారు.

కానీ మొదటికే మోసం వచ్చింది. వరుణ్ ఆడిన మ్యాచ్ లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పైగా పరుగులు భారీగా సమర్పించుకున్నాడు.  ఇక శార్దూల్ ఠాకూర్ విషయానికి వస్తే మొదటి సారి ప్రకటించిన జట్టులో ఇతను లేడు. కానీ ధోనీని మెంటార్ గా నియమించిన తర్వాత శార్ధూల్ ను జట్టులోకి తీసుకు రావడంతో ప్రముఖ పాత్ర వహించాడు. పైగా ఆల్ రౌండర్ గా ఉపయోగపడుతాడని కటింగ్ ఇచ్చారు. బ్యాటింగ్ విషయ పక్కన పెడితే, బౌలింగ్ లో ఏ మాత్రం వాడి లేదు. ఇతని బౌలింగ్ లో స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు ప్రత్యర్థులు. సో... ఇక వీళ్లిద్దరూ మళ్లీ టీమిండియాలోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న జరుగుతున్న మస్తాక్ అలి టోర్నీలో రాణిస్తే మళ్లీ అవకాశం రావొచ్చు. మరి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: