ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.. సౌత్ ఆఫ్రికా గెలిచి నిలుస్తుందా..?

M Manohar
ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్టును మొదట బ్యాటింగ్ కు పంపించింది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చారు ఇంగ్లాండ్ బౌలర్లు. ఆ జట్టు ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ఎనిమిది బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ బ్యాటర్ తో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో 34 పరుగులు చేసిన అయితే అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ చెలరేగిపోయాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా చివరి వరకు నాటౌట్ గా నిలిచి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ క్రమంలో రాస్సీ వాన్ 60 బంతుల్లో 94 పరుగులు చేయగా మార్క్రామ్ 25 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిపోయాడు. దాంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఇద్దరు స్పిన్నర్ లే ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లండ్ జట్టు 190 చేయాలి. కానీ ఆ భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎదుర్కొని చేయగలదా అనేదే ప్రశ్న. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. కానీ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఆస్ట్రేలియ ను వెనక్కినెట్టి సెమీస్ కు క్వాలిఫై అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: