ధోనికి షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్?
ఇక ఇటీవల ఏకంగా వెస్టిండీస్ జట్టు ఆడుతున్న టి-20 ప్రపంచకప్ జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న బ్రావో అభిమానులందరికీ షాకిచ్చాడు. ఏకంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. టీ20 ప్రపంచకప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగ పోతున్నాను అంటూ వెల్లడించాడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం సమయం వచ్చింది అని నేను భావిస్తున్నాను.. నా కెరీర్లో ఎన్నో హెచ్చుతగ్గులు ఎదుర్కొన్నాను అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.
పద్దెనిమిదేళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినందుకు ఎంతో కృతజ్ఞుడిని అంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగమైన పోస్టు పెట్టాడు.. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ దేశి లీగ్స్ మాత్రం ఆడుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్నాడు బ్రావో. ఇక బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం తో చెన్నై జట్టు షాక్ తగిలింది అని చెప్పాలి ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడితే ఎప్పుడు ఫామ్ లో ఉండే అవకాశం ఉంటుంది లేదంటే కేవలం ఐపీఎల్ జరిగినప్పుడు మాత్రమే మైదానంలోకి దిగుతుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఫామ్ కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇది ఒక రకంగా జట్టుకు ఇబ్బంది అని చెప్పాలి.