కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా చెలరేగేనా?

VAMSI
టీ 20 వరల్డ్ కప్ 2021 ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్ 1 మరియు 2 ల నుండి ఒక్కొక్క టీమ్ మాత్రమే సెమీస్ లో బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకోగా మిగిలిన మరొక్క స్థానం కోసం మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి. గ్రూప్ 1 లో మరొక స్థానం కోసం పోటీ పడే అవకాశం ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా జట్లకు మాత్రమే ఉంది. అయితే రన్ రేట్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా కన్నా సౌత్ ఆఫ్రికా మెరుగ్గా ఉంది మరియు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కాగా ఈ రోజు మ్యాచ్ తో కాస్త క్లారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడు గ్రూప్ 1 లో కాసేపట్లో జరిగే మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువును దక్కించుకోవాలని బంగ్లాదేశ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బాంగ్లాదేశ్ ను భారీ తేడాతో ఒడిస్తే రన్ రేట్ పరంగా సౌత్ ఆఫ్రికాను అధిగమించే చాన్స్ ఉంది. మరి ఈ రోజు జట్టు ఎలా ఆడుతుంది అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. గత వారంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తిరిగి పుంజుకుని సెమీస్ రేసులో నిలబడుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

 అయితే ఈ రోజు మ్యాచ్ జరిగేది దుబాయ్ లో కాబట్టి ఎక్కువ గెలుపు అవకాశాలు చేజింగ్ చేసే జట్టుకే ఉంటాయి. ఇది గత కొన్ని మ్యాచ్ లుగా జరుగుతూ వస్తోంది. ఆస్ట్రేలియా గత మ్యాచ్ లో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం బౌలింగ్ పరంగా ఏ విధమైన సమస్యలు ఆసీస్ కు లేవు. కేవలం బ్యాటింగ్ లో టీమ్ అంతా మూకుమ్మడిగా ఫెయిల్ అవుతున్నారు. ఫించ్ రాణిస్తున్నా వార్నర్, స్మిత్, స్టాయినిస్ లు విఫలమవుతున్నారు. ఈ రోజు కీలక మ్యాచ్ కావడంతో వీరంతా ఫామ్ లోకి రావలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: