T20 WORLD CUP: ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్రలో 4, 4, 4, 4, 4, 0

VUYYURU SUBHASH
దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతోన్న పొట్టి ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ చ‌ప్ప‌గా సాగుతుంద‌నే చెప్పాలి. ఇప్పుడు సూప‌ర్ - 12 మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే సూప‌ర్ - 12 మ్యాచ్ ల‌కు ముందు జ‌రిగిన గ్రూప్ మ్యాచ్ లే చిన్న జ‌ట్ల మ‌ధ్య చాలా ఆస‌క్తిక‌రంగా జ‌రిగాయ‌నే చెప్పాలి. సూప‌ర్ - 12 లో పెద్ద జ‌ట్ల మ‌ధ్య హోరా హోరీ పోరు ఉంటుద‌ని అంద‌రూ లెక్క‌లు వేసుకున్నారు. అయితే టోర్నీ లో ఫేవ‌రెట్ గా అడుగు పెట్టిన టీం ఇండియా తొలి రెండు మ్యాచ్ ల‌లో కూడా వ‌రుస‌గా పాకిస్తాన్ , న్యూజిలాండ్ జ‌ట్ల పై ఓడిపోయింది. దీంతో టోర్నీ క‌ళ త‌ప్పేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే టోర్నీ లో స‌రికొత్త రికార్డులు న‌మోదు అవుతున్నాయి. నిన్న ఆప్ఘ‌నిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో ముదు బ్యాటింగ్ చేసిన భారత జ‌ట్టు ఓపెనర్లు కేఎల్‌. రాహుల్ - రోహిత్ శ‌ర్మ రెచ్చి పోవ‌డ‌తో ఏకంగా 2 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఈ టోర్న‌మెంటులో తొలి సారి 200 ప‌రుగుల స్కోరు చేసిన జ‌ట్టుగా భార‌త్ రికార్డుల‌కు ఎక్కింది.

ఇదిలా ఉంటే నిన్నే మ‌రో రికార్డు న‌మోదు అయ్యింది. భార‌త్ - ఆప్ఘాన్ మ్యాచ్ కు ముందు స్కాట్లాండ్ - న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో మిల్నే వేసిన ఆరో ఓవర్లో స్కాట్లాండ్‌ బ్యాటర్‌ మాథ్యూ క్రాస్‌ రెచ్చిపోయి మ‌రీ బంతిని బాదాడు. తొలి ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించి మిల్నే ను బెంబేలు ఎత్తించాడు.

దీంతో ఆ ఒక్క ఓవర్లోనే స్కాట్లాండ్ కు ఏకంగా 20 పరుగులు లభించాయి. అయితే ఈ పొట్టి ప్ర‌పంచ క‌ప్ లో గతంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలిస్‌ స్కాట్లాండ్‌ బౌలర్‌ జాన్‌ స్టాండర్ ను కూడా ఒకే ఓవ‌ర్లో వ‌రుస‌గా ఐదు బౌండ‌రీలు బాదాడు. ఇది  రెండోసారి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: