అతను చాలా తెలివైన బౌలర్ : కోహ్లీ

frame అతను చాలా తెలివైన బౌలర్ : కోహ్లీ

praveen
ప్రస్తుతం టీమిండియా లో ఎంతోమంది స్పిన్నర్లు ఉన్నారు. ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు.. కానీ వీరందరి కంటే భిన్నంగా ఎప్పుడూ బౌలింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ ఒక స్పిన్నర్ అనడంకంటే.. ఎత్తులకు పైఎత్తులు వేసి ఒక ఇంటిలిజెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అశ్విన్ వేసేది కేవలం స్పిన్ బౌలింగ్ మాత్రమే కానీ ఆ స్పిన్ బౌలింగ్ లోనే ఎంతో వైవిధ్యం చూపించి ఆటగాళ్లను  తికమక పెట్టి చివరి వికెట్ను పడగొట్టడంలో అశ్విని ఎప్పుడూ ముందుంటాడు. మిగతా బౌలర్లు కేవలం ఫాస్ట్ బౌలింగ్ కి  మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు. కానీ అశ్విన్ మాత్రం తన బౌలింగ్లో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తూ ఉంటాడు.


 ప్రస్తుతం టీమిండియా లో కీలక స్పిన్నర్ గా మారిపోయిన రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా విజయంలో ఎప్పుడు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతేకాదు మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టడం తో అశ్విన్ దిట్ట అనే చెప్పాలి. అయితే తన బౌలింగ్ తో అద్భుతంగా రాణించిన అశ్విన్ అవసరం వచ్చినప్పుడల్లా తన బ్యాట్ తో కూడా రాణిస్తూ టీమిండియాకు విజయాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ గత కొంత కాలం నుంచి పొట్టి ఫార్మాట్ కి దూరంగానే ఉంటున్నాడు. కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నాడు అని చెప్పాలి.


 అయితే బిసిసిఐ సెలెక్టర్లు అశ్విన్ ను టి20 క్రికెట్ జట్టు తరఫున సెలెక్ట్ చేసినప్పటికీ ఇక తుది జట్టులో మాత్రం స్థానం కల్పించడం లేదు. దీంతో గత కొంత కాలం నుంచి టి20 ఫార్మాట్కు దూరం అయిపోయాడు రవిచంద్రన్ అశ్విన్. కానీ చాలా రోజుల తరువాత ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆడిన మూడో మ్యాచ్లో అశ్విన్ మళ్లీ టీ20ల్లో కి పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే అద్భుతంగా రాణించి   కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ  ఈ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టిన అశ్విన్ ఫై ప్రశంసలు కురిపించాడు. చాలా కాలం తర్వాత అశ్విన్ తిరిగి టీ-20 ఫార్మెట్లో పురోగమనం చేసి ఎంతో లయలో కనిపించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అతను మంచి వికెట్ టేకర్.. తెలివైన బౌలర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: