కెప్టెన్ కోహ్లీ కనీసం టాస్ అయినా గెలుస్తాడా?

VAMSI
ఈ రోజు జరగబోయే రెండవ మ్యాచ్ ఇంకాసేపట్లో స్టార్ట్ అవనుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా ఇంత ప్రాధాన్యత వస్తుంది అని ఎవ్వరూ అనుకుని ఉండరు. అయితే ఆ ప్రాధాన్యత ఏమిటో ఒక్క ఇండియాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే చేతులారా వచ్చిన రెండు అవకాశాలను జారవిడుచుకుని సెమీస్ అవకాశాలను పోగొట్టుకుని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడింది కాబట్టి. ఇప్పుడు తమ ముందున్న లక్ష్యం ఒక్కటే.. ఈ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై ఎలాగైనా భారీ తేడాతో గెలవాలి. అయితే ఇది సాధ్యమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు? క్రికెట్ విశ్లేషకులు. కానీ ప్రతి ఒక్క ఇండియా ప్రేక్షకుడికి ఇంకా ఆశలు ఉన్నాయి. ఇలా జరుగుతుంది అనే ఒక నమ్మకం ఇంకా ఉంది.

అందుకే ఈ రోజు మ్యాచ్ భారీ తేడాతో గెలవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ముందు మనము రెండు మ్యాచ్ లుగా జరగని ఒక అద్బుతం జరుగుతుందా అనేది చూడాలి. గత రెండు మ్యాచ్ లలో ఇండియా టాస్ ఓడిపోవడం ఓటమికి కారణంగా మిగిలిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు కావాలంటే...టాస్ గెలిచి తీరాలి. ఆ తర్వాత మొదట బ్యాటింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత భారమంతా ఇండియా బ్యాట్స్మన్ మీదనే ఆధారపడి ఉంటుంది. మొదటి నుండి ఎటాక్ చేస్తే ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం 200 పరుగులు చేస్తే తక్కువ పరుగులకు వారిని కట్టడి చేసి భారీగా రన్ రేట్ సాధించే అవకాశం ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉండే ఫామ్ ను బట్టి చూస్తే ఇలా జరుగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ రోజు మ్యాచ్ లో కొన్ని కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ప్లేయర్లు  మారనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: