వరల్డ్ కప్ ఎఫెక్ట్.. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఔట్?
ఇక కెప్టెన్గా కూడా తనదైన వ్యూహాలను అమలు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలం అవుతున్నాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా విశ్వ వేదికలపై అయితే తడబడుతూ ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలోనే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో కూడా రెండు మ్యాచ్ లలో టీమిండియా ఘోరమైన ఓటమిని చవి చూడటం తో మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై చర్చ తెర మీదికి వచ్చింది. ఇప్పటికే కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక మరికొన్ని రోజుల్లో వన్డే కెప్టెన్సీకి కూడా కోహ్లీ స్వస్తి పలికే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.
ఇక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లలో టీమిండియా ఘోరమైన ఓటమి పాలు కావడంతో ఇక ఈ ఎఫెక్ట్ అటు విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ పై కూడా పడినట్లు తెలుస్తుంది. కెప్టెన్సీ మార్పు పై త్వరలో జరిగే బిసిసిఐ సెలెక్టర్లు సమావేశంలో కూడా దీనిపై చర్చ జరగబోతుంది అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత ఇక బిసిసిఐ అసంతృప్తితో ఉందని.. ఈ క్రమంలో ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని బిసిసిఐ భావిస్తోందట. ఈ క్రమంలోనే వన్డేలు టి 20 లకు రోహిత్ లేదా మరెవరినైనా కొత్త కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని.. ఇక టెస్టులకు కెప్టెన్గా కొనసాగుతాడు అంటూ టాక్ వినిపిస్తోంది.