ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్.. ఆ ఇద్దరితో టీమిండియాకు ప్రమాదం?

praveen
టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా విఫలం అయింది. మునుపెన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే టీమిండియా చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. అయితే టీమిండియాలో ఎంతోమంది వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇంకెంతో మంది అదిరిపోయే బౌలర్లు ఉన్నారు. కానీ టీమిండియా మాత్రం రాణించడం లేదు. కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న టీమిండియా ప్రదర్శనపై మాత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్ దాయాది పాకిస్థాన్ తో ఆడింది. ఇప్పుడు వరకు పాకిస్తాన్ ఒకసారి కూడా టీమిండియాఫై విజయం సాధించకపోవడంతో.. ఈసారి కూడా టీమిండియాదే విజయం పక్క అని అనుకున్నారు. కానీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది పాకిస్తాన్ జట్టు. టీమిండియాను చిత్తుగా ఓడించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమినే భారత ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతుంటే.. ఇక తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ లో  కూడా టీమిండియా ఇదే వైఫల్యాన్ని కొనసాగించింది. న్యూజిలాండ్ చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయింది.


 దీంతో సెమీఫైనల్కు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయ్. ఇలాంటి సమయంలో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడబోతుంది కోహ్లీ సేన  అయితే ఆఫ్ఘనిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేస్తే ఇక ఓడిపోవడమే అని అంటున్నారు విశ్లేషకులు   అయితే ఇప్పటి వరకు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ స్కాట్లాండ్, నమీబియా పై జరిగిన మ్యాచులలో గెలిచింది. ఇక పాకిస్తాన్తో ఓడినప్పటికీ చివరి వరకు పోరాడింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఉన్న రషీద్ ఖాన్, ముజీబ్ బౌలర్ల తో భారత బ్యాట్స్మెన్ లకు ప్రమాదం పొంచి ఉంది  ఇప్పటివరకు టోర్నీలో మూడు మ్యాచ్ లలో 4.74 ఎకనామిక్ తో 7 వికెట్లు పడగొట్టాడు రషీద్ ఖాన్. ఇక మరో బౌలర్ ముజీబ్ రెండు మ్యాచ్లలో 4.25 ఎకానమీ తో  ఆరు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరితో టీమిండియాకు ప్రమాదం పొంచి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: