భారత్ ఈ తప్పులను రిపీట్ చేస్తే ఓటమి తప్పదు?
* ఓపెనర్లు ముందుగా పిచ్ ను అర్ధం చేసుకుని బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. మొదట బ్యాటింగ్ వస్తే పిచ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి బౌలింగ్ కు అనుకూలించవచ్చు. కాబట్టి బంతి పాతబడే వరకు ఓపికగా ఉండాలి. సింగిల్స్ రోటెట్ చేస్తూ మధ్య మధ్యలో వచ్చిన చెడు బంతులను మాత్రమే అటాక్ చెయ్యాలి. కొంతసేపు అయ్యాక పిచ్ బాగా అర్ధం అవుతుంది కాబట్టి బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది.
* బౌలింగ్ కు తగ్గట్టు మన బ్యాటింగ్ ను మార్చుకోవాలి. ఈ విషయంలోనే పాకిస్తాన్ తో భారత్ తడబడింది. న్యూజిలాండ్ బౌలింగ్ ను అంత ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు . బౌల్ట్, సౌథీ, సోధీ లతో పటిష్టంగా ఉంది. కాబట్టి ఆచితూచి ఆడుతూ పరుగులు తీయాలి.
* మ్యాచ్ లో ముఖ్యమైన ఓపెనర్లు భాగస్వామ్యం గత మ్యాచ్ లో మనకు దక్కలేదు. మొదటి ఓవర్లోనే రోహిత్ వికెట్ కోల్పోవడంతో తర్వాత ఆటగాళ్లపై ఒత్తిడి పడింది. ఇది లేకుండా ఉండాలంటే రోహిత్ రాహుల్ లు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి.
* ఇక మొదటి 15 ఓవర్లపాటు సాగే ఆట ఒక ఎత్తయితే, ఆ అయిదు ఓవర్లు మరో ఎత్తు. కాబట్టి బౌలింగ్ అయితే వీలైనన్ని తక్కువ పరుగులు ఇవ్వాలి. ఎందుకంటే న్యూజిలాండ్ లో అల్ రౌండర్లకు కొదువలేదు. ఇక ఎండోటా బ్యాటింగ్ చేస్తే ఆ అయిదు ఓవర్లలో కనీసం 50 పరుగులు చేస్తే విజయావకాశాలు ఉంటాయి. గత మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేయకపోవడం ప్రధాన కారణం అయింది. ఒక 20 పరుగులు చేసి ఉంటే పాక్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది.
* ఇక ఈమ్యాచ్ లో మనకున్న హార్డ్ హిట్టర్స్ పంత్, జడేజా మరియు హార్దిక్ పాండ్యా వీరు మ్యాచ్ స్థితిని బట్టి బ్యాటింగ్ చేయాలి. అంతే కానీ గత మ్యాచ్ లో లాగా వికెట్లు పడుతుంటే అనవసరమైన షాట్ లకు ప్రయత్నించకూడదు. వికెట్లు కాపాడుకుంటే ఆఖరి ఓవర్లలో అయినా వీలైనన్ని పరుగులు చేయవచ్చు.
* పాక్ తో మ్యాచ్ లో జరిగిన మరొక పొరపాటు ఏమిటంటే, పాక్ ఓపెనర్ల వికెట్ ను తీయలేకపోవడం. ఆరంభంలోనే వికెట్ తీయగలిగితే ప్రత్యర్థిపై ఒత్తిడి పడుతుంది. ఆలోపు మరిన్ని వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో బుమ్రా, షమీ మరియు భువి మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు.
కాబట్టి పైన తెలిపిన పొరపాట్లు జరగకుండా మ్యాచ్ పరియుస్థితికి తగ్గట్టు ఆడితే విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది.