టి20 వరల్డ్ కప్ లో క్రేజీ ఓవర్.. ఎందుకో తెలుసా?
ఇలా బౌలర్లు తమ వ్యూహాలతో కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు భారీగా పరుగులు ఇచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు బౌలర్ల బాగా సక్సెస్ అయితే.. ఇక అరుదైన రికార్డును సైతం కొల్లగొట్టడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ బౌలర్ ఇలాంటి రికార్డు కొట్టాడు. ఇక ఆ బౌలర్ వేసిన ఒక ఓవరు టి20 వరల్డ్ కప్ లోనే క్రేజీ ఓవర్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఈ క్రేజీ ఓవర్ గురించే చర్చించుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ బౌలర్ వేసిన ఓవర్ కి క్రేజీ ఓవర్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటారా.. దానికి వెనుక ఒక అరుదైన రికార్డు దాగి ఉంది.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నమీబియా- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ సాగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నమీబియా బౌలర్ ట్రాంపేల్ మన్ వేసిన ఒక ఓవర్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు క్రికెట్ ఫాన్స్ అందరు కూడా ఈ ఓవర్ ని క్రేజీ ఓవర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఓవర్లో ట్రాంపేల్ మన్ నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీయడమే దీనికి కారణం.. తొలి బంతికే అతడు స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ మున్నేను అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత మూడవ బంతికి మైక్ లియోడ్, నాలుగవా బంతికి బేర్రింగ్టన్ లను డకౌట్ చేశాడు. దీంతో అరుదైన గణాంకాలు సాధించాడు సదరు బౌలర్ .