పాక్ కోసం సంబరం.. చితకబాదిన జనం?

praveen
ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో హై వోల్టేజ్ తో జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా వీక్షించారు. ఈ క్రమంలోనే హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ ఉన్నప్పటికీ మొదటినుంచి ఆదిపత్యాన్ని సాధించిన పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.

 అయితే ఇలా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది సమయంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయులు టీమిండియా జట్టుకు మద్దతు పలకడం చూశాం..  ఇక అటు పాకిస్థాన్ పౌరులందరూ కూడా పాక్ కి మద్దతు ఇస్తూ ఉంటారు. కానీఇటీవలే భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది సమయంలో కొంత మంది భారతీయులు కూడా పాకిస్థాన్ జట్టుకు మద్దతు పలకడం సంచలనంగా మారిపోయింది. అంతేకాదు పాకిస్థాన్ జట్టు విజయం సాధించిన  సందర్భంగా ఏకంగా సంబరాలు కూడా చేసుకున్నారు.

ఢిల్లీ, బెంగాల్, కాశ్మీర్ రాష్ట్రాలలో ఏకంగా పాకిస్తాన్ గెలిచినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఒకప్పుడు భారత్ విజయాలు సాధించిన అప్పుడు కనీసం చప్పట్లు కూడా కొట్టని వాళ్ళు పాకిస్థాన్ విజయం సాధించడంతో మాత్రం సంతోషం లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు  అంతేకాదు పాకిస్తాన్ జిందాబాద్ భారత్ ముర్దాబాద్ అంటూ నినాదాలు కూడా చేయడం మరింత సంచలనంగా మారింది. కాశ్మీర్, బెంగాల్, పంజాబ్ లలో ఉన్న మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ లో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే ఏకంగా 30 మంది యువకులు ఇలా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన 90 మందిని దారుణంగా చితకబాదారు  ఇక్కడ విచిత్రం ఏంటంటే దేశభక్తిని ప్రదర్శించిన వాళ్ళని ఏకంగా కాలేజీ నుంచి తీసేసి.. భారత్ ముర్దాబాద్ అన్న వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: