వావ్.. రుతురాజ్ కెప్టెన్ అయ్యాడు?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ లో ఇటీవలే యువ సూపర్ స్టార్ గా ఎదిగాడు రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఇక తక్కువ సమయంలోనే తన సత్తా చాటి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత సీజన్లో  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ ఆటగాడు. మొదట తన ప్రదర్శన తో కాస్త నిరాశపరిచినా ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాడు. ఏకంగా ధోనీ సారథ్యంలో రాటు తేలాడు అనే చెప్పాలి. తనదైన శైలిలో రాణిస్తూ ఏకంగా పరుగుల వరద పారించాడు రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ మహేంద్రసింగ్ ధోని మాత్రం ఈ యువ ఆటగాడిని ఓపెనర్గా బరిలోకి దింపడానికి సిద్ధం అయ్యాడు అంటే రుతురాజ్ గైక్వాడ్ తన ఆటతో ఎంతలా అందరినీ ఆకర్షించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గత సీజన్ తో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్లో మరింత విజృంభించాడు.  ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారించాడు. ఇక బౌలర్ తో సంబంధం లేకుండా బౌండరీలు కొట్టేసాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ అందరి కంటే ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా రికార్డు సృష్టించాడు.

 అయితే ఇలా ఐపీఎల్ లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో తన సత్తా చాటి ఏకంగా ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా ఉన్న ఈ యువ సంచలనానికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక బాధ్యతలు అప్పగించింది. మరికొన్ని రోజుల్లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ ను మహారాష్ట్ర టి-20 టీం కెప్టెన్ గా నియమించింది మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్. కాగా ఈ దేశవాళి క్రికెట్ లీగ్ వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: