దాయాదుల సమరం : మ్యాచ్ సమయంలో వర్షం పడుతుందా?
ఈ క్రమంలోనే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఫై ప్రస్తుతం అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ఎవరు గెలవబోతున్నారో అనేదానిపై అందరూ ఊహాగానాలలోకి వెళ్లి పోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో కూడా పాకిస్థాన్ ఫై టీమిండియాదే పైచేయి కావడం గమనార్హం. ఇప్పుడు కూడా వరుస విజయాలతో టీమిండియా జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం పాకిస్థాన్ మ్యాచ్ లో కూడా అంతే దూకుడు కొనసాగించి మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రస్తుతం భారత విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ సారి భారత జట్టుపై గెలిచి చరిత్ర తిరగరాస్తాం అంటూ అటు పాకిస్థాన్ క్రికెటర్లు అంటున్నారు. అయితే ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో వాతావరణం అనుకూలించక పోతే... మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే ప్రేక్షకులకు ఎంత నిరాశ ఎదురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మరి మ్యాచ్ జరగబోయే దుబాయ్ లో వాతావరణం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. వాతావరణం పూర్తిగా అనుకూలంగానే ఉంది ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. వర్ష సూచన కనిపించడం లేదు. ఇక నేడు సాయంత్రం ఉష్ణోగ్రత 31 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షం పడే అవకాశాలు అయితే అస్సలు లేవని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇక సాయంత్రం వేళల్లో తేమ 70 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఇక ఇది క్రికెట్ మ్యాచ్ కి పూర్తిగా అనుకూలించే వాతావరణమే అంటూ తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు.