దాయాదుల సమరం : టీమిండియాలో యువకులు.. పాక్ జట్టులో సీనియర్లు?

praveen
సాధారణంగా క్రికెట్ లో మూడు ఫార్మాట్లు ఉన్నప్పటికీ పొట్టి క్రికెట్ గా పేరున్న టీ20 ఫార్మాట్ కి మాత్రమే క్రికెట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బంతి బంతికి కూడా మ్యాచ్ స్వరూపం మారిపోతుంటుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రతి మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇక చివరి బంతి వరకు కూడా విజయం ఎవరికి వరిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అయితే సాధారణంగా టి 20 మ్యాచ్  చూసే ప్రేక్షకులకు ఇలాంటి ఉత్కంఠ ఉంటుంది. అదే పాకిస్తాన్ టీం ఇండియా మధ్య మ్యాచ్ అంటే మాత్రం ఇక ఈ ఉత్కంఠ వందరెట్లు రెట్టింపు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే కేవలం ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరి చూపు  మ్యాచ్ పైనే ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ప్రపంచం చూపు మొత్తం ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపైనే ఉంటుంది  కాగా ఇలా టి20 వరల్డ్ కప్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ గా ఉన్న పాకిస్తాన్ భారత్ మధ్య జరిగే మ్యాచ్  నేడు జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు.

 ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అనే దానిపై కూడా ఎన్నో అంచనాలు కూడా పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు గణాంకాలు చూసుకుంటే టీమ్ ఇండియా పాకిస్తాన్ పై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో కూడా అందరికీ హాట్ ఫేవరేట్గా టీమిండియా బరిలోకి దిగుతోంది. దుబాయ్ వేదికగా రెండు దాయాది దేశాల మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ టి 20 వరల్డ్ కప్ లో టీమిండియా యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చింది సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి  లాంటి ఆటగాళ్ళకు ఛాన్స్ ఇచ్చింది. అయితే అటు పాకిస్థాన్ జట్టులో మాత్రం అనుభవం ఉన్న సీనియర్ లకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపిక చేశారు  . అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ బ్యాటర్లుగా .. ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్ ఆల్‌రౌండర్లుగా... హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ బౌలర్లుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. మరి నేడు జరగబోయే రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: