ధోని ఇంకొంతకాలం క్రికెట్ ఆడితే బాగుండేది : కేఎల్ రాహుల్
అయితే ఇలా భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోని ఉన్నపళంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియాకు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు అనుకున్న మహేంద్రసింగ్ ధోని అకస్మాత్తుగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ షాకిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇటీవలే ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. మరోసారి తన ఫినిషర్ పాత్రను పోషించాడు మహేంద్రసింగ్ ధోని.
అయితే ధోని మరోసారి ఫామ్ లోకి రావడంతో ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండి ఉంటే బాగుండేదని ఎంతోమంది అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇంకా కొంతకాలం పాటు క్రికెట్ ఆడి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది. వారూ ఛాంపియన్ కావడానికి అర్హులు. వీలైతే ధోని మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది అంటూ ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కె.ఎల్.రాహుల్ తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు.