ధోని తోపు.. అతన్ని ఎవరు చేరుకోలేరు : సెహ్వాగ్

praveen
భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన క్రికెటర్గా మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో నిలిచిపోతాడు అని చెప్పాలి. భారత్ జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ను ఏకంగా రెండుసార్లు తన కెప్టెన్సీ తో గెలిపించాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డులను సృష్టించాడు అని చెప్పాలి.  అంతేకాదు ప్రపంచ క్రికెట్లో ఒక అద్భుతమైన ఫినిషర్ గా కూడా మహేంద్రసింగ్ ధోని పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే తన అద్భుతమైన ప్రదర్శన తో జట్టుకు విజయాన్ని అందించాడు మహేంద్రసింగ్ ధోని.

 ఇలా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న మహేంద్రసింగ్ ధోని గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే.  అయితే అటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ధోనీ సారథ్యం పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.


 వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరుకుంటున్నట్లు తెలిపారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ తెలిపాడు. ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన వీరు ఈ వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఒక అద్భుతమైన జట్టు. టీమిండియాలో ఎవరు ధోనిని అధిగమించలేరు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఇక చెన్నై జట్టులో కూడా సారధిగా ఎవరు ధోనిని చేరుకోలేరూ అంటూ తెలిపాడు. అది అంత తేలిక కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక కెప్టెన్ గొప్ప తనం అనేది అతడు సాధించిన ట్రోఫీల ఆధారంగానే గుర్తిస్తారు. ధోని ఇప్పటికే చెన్నై తరఫున తొమ్మిదిసార్లు ఫైనల్ ఆడి 4 సార్లు టైటిల్ అందించాడు అలాంటి రికార్డును చేరుకోవడం అంత తేలిక కాదు.  రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ గెలిచినప్పటికీ 9 సార్లు ఫైనల్ ఆడాలంటే చాలా సమయం పడుతుందని తెలిపారు వీరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: