శార్దూల్ ఠాకూర్ ఎంపికలో ధోని హస్తం ఉందా?

VAMSI
ఐపీఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండడంతో ఆ తర్వాత అందరి దృష్టి ఇంకో 4 రోజుల్లో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ మీద పడనుంది. ఇప్పటికే ఇండియా నుండి వరల్డ్ కప్ లో పాల్గొనే టీం సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్లలో ఉన్న ఆటగాళ్ల మార్పుల చేర్పులకు ఈ రోజు వరకు అవకాశం ఉండడంతో కాసేపటి క్రితమే ఒక కీలక ప్లేయర్ ను జట్టులో చేర్చుకుని... మరో ప్లేయర్ ను రిజర్వు ప్లేయర్ గా మార్చింది. అయితే ఇది అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న అక్షర్ పటేల్ బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన క్యాచ్ లను అందుకుంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే ఐపీఎల్ లో అక్షర్ పటేల్ ప్రదర్శన సెలెక్టర్ లను సంతృప్తి పరచలేదని అర్ధం అవుతోంది. అందుకే అక్షర్ పటేల్ ను సెలెక్టెడ్ లిస్ట్ నుండి రిజర్వు ప్లేయర్ గా చేశారు. కానీ జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. అయినా ఎందుకో బౌలింగ్ అల్ రౌండర్ పైనే దృష్టి పెట్టారు సెలెక్టర్లు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శార్దూల్ ఎంపికలో మాజీ కెప్టెన్ మరియు వరల్డ్ కప్ కు ప్రత్యేకంగా మెంటార్ గా ఎంపిక అయిన మహేంద్ర సింగ్ ధోని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు.
ఇంకో విషయం కూడా ప్ర్మముఖంగా వినిపిస్తోంది. ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు తరపున ఆడిన లెగ్ స్పిన్నర్ చాహల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనిని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా శార్దూల్ జట్టులోకి రావడంతో అనుమానాలు రెట్టింపయ్యాయి. ఈ నెల 17 నుండి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. టీమిండియా ఏ విధమైన ఆటతీరును ప్రదర్శిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: