వావ్.. టీమిండియా కొత్త జెర్సీ అదిరిపోయింది?
కొంతకాలం నుంచి బీసీసీఐ టీమిండియా జెర్సీ లో ఎన్నో రకాల మార్పులు చేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన కొత్త జెసి ఎలా ఉండబోతుంది అన్నది అందరిలో ఉత్కంఠ నెలకొంది. నేడు ఈ కొత్త చేసి విడుదల చేస్తాము అంటూ బిసిసిఐ ప్రకటించడంతో విడుదల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే అందరూ ఎదురుచూస్తున్న టీం ఇండియా జెర్సీ వచ్చేసింది. ప్రస్తుతం ఇక ఈ జెర్సీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. టీమిండియా నయా జెర్సీ చూసి ప్రేక్షకులు అందరూ కూడా వావ్ అనేస్తున్నారు.
ఇదిగో ఇదే బిలియన్ చీర్స్ జెర్సీ అంటూ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బూమ్రా కొత్త జెర్సీ వేసుకున్న ఫోటోలని ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే జెర్సీ పై కొన్ని కొత్త డిజైన్స్ కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ కొత్త డిజైన్స్ కోట్లాదిమంది అభిమానుల చీర్స్ నుంచి స్ఫూర్తి తీసుకొని రూపొందించినట్లు తెలిపారు. అయితే ఇలా కొత్త జెర్సీ విడుదల అయిందో లేదో అభిమానులు ఇలాంటి కొత్త జెర్సీ దక్కించుకోవాలని భావిస్తూ ఉంటారు. ఒకవేళ కొత్త జెర్సీ కొనుగోలు చేయాలి అంటే ఎం పి ఎల్ వెబ్ సైట్ కి వెళ్ళి కొనుగోలు చేయాలి అంటూ తెలిపారు. ఏదేమైనా ఇటీవలే విడుదలైన టీమ్ ఇండియా కొత్త జెర్సీ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి.