ఆనందంలో ధోని అభిమానులు.. ఎందుకో తెలుసా?

praveen
భారత క్రికెట్లో దిగ్గజ కెప్టెన్గా తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కానీ.. రెండు ప్రపంచ కప్ లను భారత జట్టు కు అందించిన ఘనత కేవలం ధోని కి మాత్రమే సొంతం అని చెప్పాలి.   భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.  ఇప్పటికి కూడా ఐపీఎల్ లో తనదైన వ్యూహాలతో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా మ్యాచ్ ను తనవైపుకు తిప్పుకుని తన కెప్టెన్సీ తో  అదరగొడుతున్నాడు.



 అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా కీపర్గా సక్సెస్ అవుతున్నప్పటికీ ఒకప్పటిలా ఫినిషర్ గా మాత్రం మారలేక పోతున్నాడు. ధోని వయసు పెరిగిపోయిందని అందుకే బ్యాటింగ్ వేగం కూడా తగ్గిందని గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని.  అంతేకాదు పలుమార్లు ధోని బ్యాటింగ్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి.  ఇలా ధోని బ్యాటింగ్ తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఎంతోమంది నేటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  అయితే ఇటీవలే ధోని అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చినట్లు  తెలుస్తోంది.




 దీంతో బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో  క్లిష్టసమయంలో బ్యాటింగ్ కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రాణించాడు. మరోసారి తన స్టైల్ లో ఫినిషింగ్ చేశాడు. ఆరు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్తో 18 పరుగులు చేశాడు. దీంతో సీఎస్కే జట్టు ఘన విజయం సాధించింది. ఇక 9 సారి ఐపీఎల్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.  ఇక ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాత మహేంద్రుడు గుర్తుకు వచ్చినట్లు సీఎస్కే ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: