కోహ్లీ, రోహిత్ కన్నా అతను బెటర్.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా జట్టులో కె.ఎల్.రాహుల్ ఎంత కీలకమైన ఆటగాడిగా మారిపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఏకంగా టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ గా మారిపోతున్నాడు కె.ఎల్.రాహుల్. సాధారణంగానే కె.ఎల్.రాహుల్ ఒక టెక్నికల్ బ్యాట్మెన్ అన్న విషయం తెలిసిందే. ఎంతో ఆచితూచి ఆడుతూ భారీ స్కోర్లు చేయగల సత్తా కె.ఎల్.రాహుల్ సొంతం. అలాంటి కె.ఎల్.రాహుల్ కెరియర్ గత కొన్ని రోజుల నుంచి మాత్రం పీక్ స్టేజ్లో ఉంది.



 ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా సరే వారి తో ఒక ఆట ఆడుకుంటున్నాడు కె.ఎల్.రాహుల్. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఎల్.రాహుల్ ఓవైపు జట్టును సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడం తో పాటు మరో వైపు జట్టులో కీలకమైన బ్యాట్మెన్ గా కూడా రాణిస్తున్నాడు.   జట్టు భారీ స్కోరు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటున్నాడు  కేఎల్ రాహుల్. ఇక తన అద్భుతమైన బ్యాటింగ్తో మాజీ ఆటగాళ్ల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు.  ఇకపోతే ఇటీవల కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై గౌతమ్ గంభీర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.




 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్నా ఎక్కువ సామర్థ్యం కేఎల్ రాహుల్ వద్ద ఉంది అంటూ  అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టు లో అందరికన్నా ఎక్కువ రేంజ్ లో షాట్లు ఆడే సత్తా సామర్థ్యం కేఎల్ రాహుల్ కు మాత్రమే ఉన్నాయి అంటూ గౌతం గంభీర్ గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గౌతమ్ గంభీర్  చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి  ఇకపోతే ఇటీవలే పంజాబ్ కింగ్స్ జట్టు  ఐపీఎల్ నుంచి ప్లే ఆప్ కి చేరకుండానే నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: