కోహ్లీని ఫిదా చేసిన ఆటగాడు మన తెలుగువాడే..!

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ లోని లీగ్ మ్యాచ్లు ముగిసాయి. అయితే నిన్న జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టుకు విజయం కోసం ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో క్రికెట్ అభిమానులతో పాటు ఆ జట్టు కెప్టెన్ అలాగే భారత కెప్టెన్ అయినా విరాట్ కోహ్లీ ని ఫిదా చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆటగాడి పేరు వైరల్ అవుతుంది. కానీ ఈ ఆటగాడు మన తెలుగు రాష్ట్రానికి చెందిన వాడని ఇతనిది తూర్పుగోదావరి జిల్లా అని చాలామందికి తెలియదు.

1993 అక్టోబర్ 3న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో శ్రీకర్ భరత్ జన్మించాడు. అయితే భారత్ కు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అదే సమయంలో భరత్ వికెట్ కీపర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పటి వరకు మన దేశీయ క్రికెట్లో శ్రీకర్ భరత్ ఆంధ్ర జట్టు తరఫున ఆడుతున్నాడు. కానీ మనోడు 2015 లో ఆడిన ఇన్నింగ్స్ తో కలెక్టర్లను కట్టి పడేసాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ఆంధ్ర ఆటగాడు 2018 లో టీమిండియా బ్లు జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వృద్ధిమాన్ సాహాతో పాటు మరో వికెట్ కీపర్ గా శ్రీకర్ భరత్ ఎంపికయ్యాడు. అలాగే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీకర్ భరత్ భారత జట్టులో అవకాశం వచ్చింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఫిబ్రవరిలో జరిగిన వేలంపాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శ్రీకర్ భరత్ ను కనీస ధర అయినా 10 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు 69 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 3909 పరుగులు చేసిన శ్రీకర్ భరత్ ఖాతాలో ఎనిమిది శతకాలు 20 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే వికెట్ కీపర్ గా 232 క్యాచ్ లు పట్టిన ఈ ఆంధ్ర ఆటగాడు 27 స్టాంపులు కూడా చేశాడు. అయితే నిన్న బెంగళూరు జట్టును శ్రీకర్ భరత్ గెలిపించిన తీరుపై మన మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: