టీమ్ ఇండియా జెర్సీ మారబోతుంది.. ఎప్పుడో తెలుసా?

praveen
టీమిండియా.. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియా పై భారత అభిమానులందరూ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.  ఎందుకంటే అప్పుడెప్పుడో ధోనీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ధోనీ నుంచి కెప్టెన్సీని బాధ్యతలను స్వీకరించాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకూ  వరల్డ్ కప్పు ఆడింది టీమిండియా. కానీ ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేక పోయింది. ఈ క్రమంలోనే టీమిండియా మరికొన్ని రోజుల్లో ఆడబోయే టి20 వరల్డ్ కప్ ఫై భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఇండియన్ ప్రేక్షకులు.  ఇక కోహ్లీ కెప్టెన్సీలో ఒక్క వరల్డ్ కప్ గెలవకపోతామా అని ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలోనే అటు విరాట్ కోహ్లీ కూడా టి20 వరల్డ్ కప్ తర్వాత తాను టి 20 జట్టుకు కెప్టెన్గా రిటైర్మెంట్ ప్రకటించపోతున్నాను అంటూ చెప్పటం సంచలనంగా మారిపోయింది.  దీంతో ఇక ఈ వరల్డ్ కప్ కోహ్లీ కెప్టెన్సీ లో గెలవాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా ఎలా రాణించ పోతుందో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి టీమిండియా తన జెర్సీ మారుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం బ్లూ జెర్సీ ధరించిన టీమిండియా గత కొంతకాలం నుంచి మాత్రం జెర్సీ రంగులో పలు మార్పులు చేస్తూ వస్తుంది.  ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ అటు టీమిండియా జట్టు జెర్సీ డిజైన్ మార్చి బోతుంది అని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది.  ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ టీమిండియా అభిమానులు మాత్రం జెర్సీ ఎలా మారబోతుంది అనేదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 ఈ క్రమంలోనే టీమిండియా నయా జెర్సీ మరికొన్ని రోజులలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త జెర్సీ ఈ నెల 13వ తేదీన అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టి20 ప్రపంచ కప్ నేపథ్యంలో సరికొత్త డిజైన్లో భారత క్రికెట్ జట్టు యొక్క జెర్సీ ఉండబోతుంది అని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. కాగా గత కొన్ని రోజుల నుంచి టీమిండియా రెట్రో జెర్సీ తోనే లిమిటెడ్ ఓవర్ క్రికెట్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇకపోతే బిసిసిఐ కిట్ స్పాన్సర్ కొత్త జెర్సీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బ్లీడ్ బ్లూ అనేది టీమిండియా నినాదం. ఇక టి20 వరల్డ్ కప్ కోసం రాబోయే కొత్త విద్యార్థి కూడా ఆ రంగులోనే ఉండబోతుంది అన్నది ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీన బిసిసీఐ అధికారికంగా లాంచ్ చేయబోతున్న ఎలా ఉండబోతుంది అనే దానిపై మాత్రం ప్రస్తుతం భారత అభిమానులు అందరూ ఆసక్తిగా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: