భారత్,
పాకిస్తాన్ మ్యాచ్ కోసం రెండు దేశాల
క్రికెట్ అభిమానులు ఎప్పుడు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా క్రికెట్లో కూడా ఎప్పుడు ఈ రెండు దేశాల జట్లు కూడా చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. అయితే
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మన భారత
క్రికెట్ జట్టు తో ప్రపంచ కప్ లో పోటీపడిన ఒక్కసారి కూడా మనల్ని ఓడించలేదు. అయినంత మాత్రాన
పాకిస్తాన్ జట్టులో మంచి ఆటగాళ్లు లేరని కాదు. అయితే
పాకిస్తాన్ జట్టు గురించి చర్చించ వలసిన సమయం వచ్చిన ప్రతిసారి
పాక్ జట్టు పేసర్
షోయబ్ అక్తర్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి వస్తుంది. అయితే 1997 సంవత్సరంలో
వెస్టిండీస్ జట్టు పై
పాకిస్తాన్ జట్టు తరఫున
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన
షోయబ్ అక్తర్ 2011 ప్రపంచకప్ తర్వాత
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక ఆ తర్వాత నుండి
క్రికెట్ విశ్లేషకునిగా మారి తన అభిప్రాయాలను
యూట్యూబ్ వేదికగా అభిమానుల ముందు ఉంచుతూ వస్తున్నాడు.
అయితే
క్రికెట్ ప్రపంచం లో ఎక్స్ప్రెస్ గా పేరొందిన
షోయబ్ అక్తర్ తిరిగి ఫీల్డులోకి వచ్చాడు. తాజాగా
షోయబ్ అక్తర్ క్రికెట్ మైదానంలో బౌలింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో అక్తర్ వేసిన బాల్ బ్యాట్స్మెన్ ప్యాడ్ కు తగిలింది. ఆ తర్వాత అక్తర్ తో సహా అతని జట్టు సభ్యులందరూ ఔట్ అని అప్పీల్ చేశారు. కానీ ఎంపైర్ నాటౌట్ ఇవ్వడంతో అందరూ నిరాశ చెందినట్లు ఆ వీడియోలు కనిపిస్తుంది. అయితే ఆ వీడియో పై అభిమానులు స్పందిస్తూ 46 ఏళ్ల వయసులో కూడా అక్తర్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడని కొందరు అంటుంటే...
పాకిస్థాన్ జట్టు తరఫున ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనమని మరొకరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 224 మ్యాచ్ లు ఆడిన అక్తర్ 444 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.