గురువు ధోనికే మస్కా కొట్టిన రిషబ్ పంత్?

praveen
మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం భారత క్రికెట్ లో మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో కూడా దిగ్గజ కెప్టెన్ గానే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఏకంగా మూడుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు.  ఇకపోతే మహేంద్ర సింగ్ ధోనీ గత కొంత కాలం నుంచి ఫామ్ ని కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అయితే బ్యాటింగ్ పరంగా ఎలా ఉన్నప్పటికీ కెప్టెన్సీ పరంగా కీపింగ్ పరంగా మాత్రం ఇప్పటికీ కూడా ఎవరూ సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎప్పుడూ కూల్ గా ఉంటూ పదునైన వ్యూహాలతో మ్యాచ్ నూ  తన అధీనంలోకి తెచ్చుకోవడం లో ధోనీ ఎప్పుడూ ముందుంటాడూ.


 ఈ క్రమంలోనే ఇటీవల వరుస విజయాలు సాధించి ఏకంగా ఐపీఎల్ లో మొదట ప్లే ఆప్ కి క్వాలిఫై అయిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతోంది.   వికెట్ల వెనకాల ఉండి ఇక రెప్పపాటులో పాటులో స్టంప్ ఔట్ చేయడంలో కూడా మహేంద్రసింగ్ ధోని ఎప్పుడు ముందుంటాడు. ఇకపోతే ఇటీవల ఢిల్లీ కాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ధోనీ శిష్యుడుగా ఉన్న రిషబ్ పంత్ ని స్టంప్ ఔట్ చేయడంలో ధోని విఫలమయ్యాడు. ఇక్కడ స్టంప్ ఔట్ చేయడంలో ధోని ఆలస్యం అయ్యాడు అనేదానికంటే ధోని వేగాన్ని గమనించి అంతకంటే వేగంగా రిషబ్ పంత్  క్రీజు లోకి వచ్చేసాడు అని చెప్పాలి.



 ఇన్నింగ్స్ లో భాగంగా తొమ్మిదో ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ క్రీసూ వదిలి బయటకు వస్తాడని పసిగట్టిన జడేజా  దూరంగా బంతి విసిరాడు. ఈ క్రమంలోనే ఎంతో తెలివిగా ఆలోచించాడు రిషబ్ పంత్. వెంటనే షాట్ ఆలోచనను విరమించుకుని.. ఇంతలోనే వేగంగా క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే మహేంద్రసింగ్ ధోని వికెట్లను గిరాటేసాడు. ఈ క్రమంలోనే  ఫీల్డ్ అంపైర్ కూడా థర్డ్ ఎంపైర్ అడగగా చివరికి రివ్యూలో పంత్ ధోని వికెట్లను గిరాటేయడానికి  ముందే క్రిసులోకి వచ్చినట్లు తేలింది.దీంతో నాటౌట్ గా ఇచ్చారు.  ఇక ఇది చూసిన వారు ఏకంగా గురువైన ధోనికే పంత్ మస్కా కొట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: