ధోని ఒక కింగ్ కాంగ్.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు?
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు అంటే మ్యాచ్ తన అధీనంలోకి తెచ్చుకోవడానికి పదునైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాడు. అయితే ధోని టి20 క్రికెట్ లో అంత సమర్ధుడు కాబట్టే ఇక భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఆడబోయే టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మెంటార్ గా ధోనిని నియమించింది బీసీసీఐ. ఇక ధోని మెంటార్ గా నియమించడంతో ఎంతోమంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇకపోతే ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రవిశాస్త్రి ధోని సారథ్య ప్రతిభపై ఇటీవలే ప్రశంసల వర్షం కురిపించాడు.
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో ధోనీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. టి 20 క్రికెట్ ఫార్మాట్లో మహేంద్ర సింగ్ ధోనీని కింగ్ కాంగ్ గా కూడా పిలవచ్చు అంటూ రవిశాస్త్రి తెలిపాడు. ధోనీ కెప్టెన్సీ చేసేటప్పుడు మ్యాచ్ మొత్తం అతడి ఆధీనంలోనే ఉంటుంది. పరిస్థితులు అన్నీ కూడా అదుపులోనే ఉంటాయి అంటూ రవి శాస్త్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఇప్పటికే టీ-20 ఫార్మెట్లో తన సత్తా చాటిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇక ఇటీవల ఐపీఎల్ లో కూడా తన మిస్టర్ కూల్ కెప్టెన్సీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అందరికంటే ముందు ఉంచి మొదట ప్లే ఆప్ కి క్వాలిఫై అయిన జట్టుగా నిలిపాడు మహేంద్రసింగ్ ధోని.