ఐపీఎల్ 2021 : కేకేఆర్ కు షాక్.. పంజాబ్ విజయం

M Manohar
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 చరమ దశకు రావడంతో ప్రస్తుతం జరుగుతున్న లీగ్ మ్యాచ్ లన్నీ ప్లే ఆఫ్ కోసం కీలకమైనవి. అందులోనే ఓ మ్యాచ్ ఈరోజు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ తీసుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే కేకేఆర్ జట్టులో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (67) అర్థ శతకం తో రాణించగా మరో ఓపెనర్ గిల్ నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి 34 పరుగులు. నితీష్ రానా 31 పరుగులు చేశారు. కానీ మిగిలిన వారందరూ పెద్దగా పరుగులు చేయకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక 166 పరుగులు లక్ష్యంతో బరిలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ వెనుదిరిగిన కేఎల్ రాహుల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉండి అర్థ శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్రా పోషించాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కొన్ని పరుగులు చేస్తే వెనుదిరిగిన కెప్టెన్ రాహుల్ మాత్రం కె.ఆర్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. కానీ చివరి ఓవర్ లో రాహుల్ (67) ఔట్ కావడంతో షారుఖ్ ఖాన్(22) ఒక్క బౌండరీతో జట్టును గెలుపు తీరాలు దాటించాడు. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 2021 ఐదో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ను వెన్నకి నెట్టి 5వ స్థానానికి చేరుకుంది పంజాబ్. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్ నెట్ రన్ రేట్ కారణంగా పది పాయింట్లే ఉన్నా ప్రస్తుతం పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్ కింగ్స్ గెలుపుతో ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: