ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే యూఏఈ వేదికగా ఈనెల 17 నుండి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు పొట్టి ఫార్మాట్ అయినా టీ-20లో తాను కెప్టెన్ గా వ్యవహరించినని.... కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ప్రకటించి తన అభిమానులను అలాగే మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ ఈ కెప్టెన్సీ వదులుకోవడానికి భారత జట్టులో కీలక ఆటగాళ్లు అయిన అజింక్యా రహానే. ఛతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ లు కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న భారత ఆటగాళ్లు దీనికంటే ముందు ఇంగ్లాండ్ లో... అక్కడి ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ లో పాల్గొన్నారు. అంతకంటే ముందు అక్కడే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టుతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో లో పోటీపడి ఓడిపోయారు. అయితే ఈ ఓటమికి రహానే, పూజారా, అశ్విన్ లే కారణమని విరాట్ కోహ్లీ అన్నట్లు తెలిసింది. దాంతో ఆ ముగ్గురు ఆటగాళ్ళు కోహ్లీ పైన అలాగే అతని కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అలాగే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ అయిన జే షాకు దీనిపైన ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే కోహ్లీ ఏకపక్ష నిర్ణయాల కారణంగా మనం ఈ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఓడిపోయామని వారు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసే సమయంలో బీసీసీఐ కోహ్లీ నిర్ణయాలను సమర్ధించ లేదని... పట్టించుకోలేదని తెలుస్తోంది అయితే తన నిర్ణయాలను విస్మరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో తన కెప్టెన్సీని వదులు కుంటున్నట్లు తెలుస్తుంది.