కేఎల్ రాహుల్ నిర్ణయం అర్థం పర్థం లేనిది.. సన్నీ ఆగ్రహం?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్నాడు క్రిస్ గేల్. క్రిస్ గేల్ ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు ఎంత విధ్వంసం సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రిస్ గేల్ ఒక్కసారి బ్యాట్ జులిపించాడు అంటే  పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. ఇక ఐపీఎల్లో క్రిస్ గేల్ ఆటను అటు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు క్రిస్ గేల్. అయితే ఇటీవలే క్రిస్ గేల్ పుట్టినరోజు సందర్భంగా ఇక ఈ యూనివర్సల్ బాస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతాడు అని ప్రేక్షకులు భావించారు.

 ఇక జట్టుకు ఒంటిచేత్తో విజయం అందిస్తాడు అని అనుకున్నారు. కాగా ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఇక క్రిస్ గేల్ అద్భుతంగా రాణిస్తాడు అని అనుకున్నప్పటికీ  పంజాబ్ కింగ్స్ లో తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.  ఇకపోతే ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు రెండు పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది అన్న విషయం తెలిసిందే.  ప్రత్యర్థి ఇచ్చిన టార్గెట్ చేధించే వరకు వెళ్లి చివరి అడుగులో తడబడింది.  అయితే తుది జట్టులో క్రిస్ గేల్ కు అవకాశం కలిపించకపోవడంపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.

 ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రిస్ గేల్ ను జట్టులోకి తీసుకోకపోవడం పై స్పందించిన సునీల్ గవాస్కర్ పుట్టినరోజున క్రిస్ గేల్ పక్కన పెట్టాలి అనుకునే పంజాబ్ జట్టు నిర్ణయం అర్ధరహితం అంటూ సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను టి20 లీగ్ లో ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. కానీ అతని పక్కన పెట్టడం లో పంజాబ్ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: