టీమిండియా సారధి
విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.క్రికెట్ చరిత్రలో
కోహ్లీ సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఇక ఐపీఎల్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్ అయిన
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్‌గా టాస్‌కి వెళ్లిన
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో ఒకే టీమ్‌కి ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలివడం జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన
కోహ్లీ బ్యాటింగ్ ని ఎంచుకున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో రెండో ఓవర్లోనే
విరాట్ కోహ్లీ (5: 4 బంతుల్లో 1x4) వికెట్ చేజార్చుకోవడం జరిగింది. ప్రసీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా
కోహ్లీ అవుట్ అవ్వడం జరిగింది.ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 వ సంవత్సరం నుంచి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరపున
విరాట్ కోహ్లీ ఆడుతుండగా.. ఇక ఈరోజు కోల్‌కతాతో మ్యాచ్ అతనికి కెరీర్లోనే 200 వ మ్యాచ్ గా నిలిచింది.ఇక ఈ 200 మ్యాచ్‌లూ కూడా బెంగళూరు తరఫునే
కోహ్లీ ఆడటం జరిగింది.. ఐపీఎల్‌లోనే మరే క్రికెటర్ కూడా ఒకే జట్టుకి ఇన్ని మ్యాచ్‌లు ఎప్పుడూ ఆడలేదు.
ఇక
విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ మొత్తం 182 మ్యాచ్‌లు ఆడగా..
సురేశ్ రైనా కూడా
చెన్నై తరుపున 172 మ్యాచ్‌లు
ఆడి మూడో స్థానంలో వున్నాడు. ఇక ఆ తర్వాత కీరన్ పొలార్డ్ కూడా 172 మ్యాచ్‌లు (ముంబయి),
ఆడి మూడవ స్థానంలో ఉండగా
రోహిత్ శర్మ 162 మ్యాచ్‌లు (ముంబయి)
ఆడి నాలుగవ స్థానంలో వున్నాడు. ఇక టాప్-5లో వీరు కొనసాగుతున్నారు.ఇక ఐపీఎల్లో 200 మ్యాచ్‌లను ఆడిన
విరాట్ కోహ్లీ 130.41 స్ట్రైక్‌రేట్‌తో 6081 పరుగులు చేశాడు. ఇక ఇందులో ఐదు సెంచరీలు ఇంకా అలాగే 40 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా
కోహ్లీ నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అతని తర్వాత స్థానంలో
శిఖర్ ధావన్ 5,577 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.