ముంబైలో ఆ సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది : నెహ్ర

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఉన్న జట్ల గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తూ ఉంటారు.  ఏ జట్టు బాగా రాణిస్తుంది.. ఏ ఆటగాడు సత్తా చాటుతాడు అన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు.  అయితే మరికొన్ని రోజుల్లో సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్ రెండవ దశ ప్రారంభం కాబోతుంది  ఇప్పటికే అన్ని జట్లు ఐపీఎల్ కోసం సిద్ధం అయ్యాయి.  యూఏఈ చేరుకొని క్వారంటైన్ కూడా పూర్తి చేసుకుంటున్నాయి.

 ఇక మరికొన్ని జట్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి.  అయితే 2019, 2020 సీజన్లలో అటు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుని తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది  ఇక ఇప్పుడు ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది.  ఇక ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతి ఒక ఆటగాడు అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా ముంబైలో హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

 పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి సరిగ్గా సరిపోయే హార్దిక్ పాండ్యా చూడటానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు కొడుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడు అంటే స్కోర్ బోర్డు  పరుగులు పెడుతూ ఉంటుంది  అయితే హార్దిక్ పాండ్యా బుజం గాయం కారణంగా ఐపీఎల్ మొదటి దశలో అసలు బౌలింగ్ జోలికి వెళ్లలేదు. అయితే తాజాగా హార్దిక్ పాండ్య ప్రదర్శనపై మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందరి కళ్ళన్నీ హార్దిక్ పాండ్యా పైనే ఉన్నాయి..  హార్దిక్ పోలార్డ్ లతో చెరో రెండు ఓవర్లు బౌలింగ్ వేయిస్తే ముంబై జట్టుకు ఎంతో లాభం చేకూరుతుంది  ఇక రెండవ దశలో హార్దిక్ బ్యాట్ తో కూడా ప్రభావం చూపించగలడు. గత ఏడాది తడబడ్డాడు    కానీ ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా హార్దిక్ పాండ్యకు ఉంది ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: