మాజీ ఆర్సీబీ ప్లేయర్ కెరీర్ ప్రమాదంలో పడిందా ?... ?

VAMSI
ఎంతోమంది ఆటగాళ్లు క్రికెట్ మీద ఎంతో ఇష్టంతో ఎక్కడో గల్లీ క్రికెట్ నుండి ఎంతో శ్రమతో జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటూ ఉంటారు. కానీ ఒక్క సారిగా జాతీయ జట్టులో చోటు అంటే దానిని దక్కించుకున్న దానికన్నా, నిలబెట్టుకోవడం కోసం అంతే కష్ట పడాల్సి ఉంటుంది. అలా వచ్చిన అవకాశాలను చాలా మంది క్రికెటర్లు కెరీర్ ను ప్రథమ దశలోనే పోగొట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ కొందరు ప్లేయర్స్ మాత్రం అనుకున్న దాని కన్నాఅధ్బుతంగా రాణిస్తూ కెరీర్ లో ఉత్తమమైన దశలో కొనసాగుతూ ఉంటారు. అయితే అలాంటి ఒక ప్లేయర్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఒకానొక దశలో ఆ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఫామ్ కోల్పోయి కెరీర్ ప్రమాదంలో పడింది. అతనెవరు... సమస్య ఏమిటో ఒకసారి చూద్దాం.
న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ అయిన కొలిన్ డి గ్రాండోమ్ 2012 లో జింబాబ్వే తో ఆడిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. కానీ ఆ మ్యాచ్ లో తను క్రీజులో వుండగానే మ్యాచ్ పూర్తయింది. కాబట్టి పరుగులు ఏమీ చేయకుండానే నాట్ ఔట్ గా మిగిలాడు. ఆ తర్వాత అదే సంవత్సరం వన్ డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో ఆరంగేట్రం చేశాడు.  ఈ మ్యాచ్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. పరిమిత ఓవర్ క్రికెట్ లో రెగ్యులర్  గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తన కెరీర్ మలుచుకోడంలో  సక్సెస్ కాలేకపోయాడు. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన న్యూజీలాండ్ టీమ్ 5 టీ20 లు ఆడింది. అయితే అంతగా ఫామ్ లో లేని బంగ్లాదేశ్  నిలువరించడంలో లాథమ్ సేన ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ గా జట్టులో ఉన్న కొలిన్ డి గ్రాండ్ హోమ్ అయితే చాలా నిరాశపరిచాడు.
బాంగ్లాదేశ్ జట్టులో అంతగా అనుభవం లేని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నజుమ్ అహ్మద్ బౌలింగ్ లో ఆడిన 5 మ్యాచ్ లలో 4 సార్లు ఔటవ్వడం చాలా బాధాకరం. ఈ అయిదు మ్యాచ్ లలో అతని స్కోర్ వివరాలు 1, 8, 0, 0 మరియు 9 గా ఉన్నాయి.  ఒక అంతర్జాతీయ మేటి ఆల్ రౌండర్ క్రికెటర్ ఇంతలా విఫలం అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. దీనితో అతనిపై సోషల్ మీడియా వేదికలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో కూడా చోటును కోల్పోయాడు. ఒక కొలిన్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా అని అంతా అనుకుంటున్నారు. మరి గ్రాండ్ హోమ్ మళ్లీ దేశవాళీ మ్యాచ్ లలో ఆడి ఫామ్ అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: