ఐపీఎల్ టైటిల్ గెలిచే జట్టిదే ?

VAMSI
ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేదనే చెప్పాలి. ఇండియాలో బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు క్యాష్ రిచ్ లీగ్ అని పేరుంది. ప్రపంచంలో ఉన్న చాలా మంది క్రికెటర్లు ఎలాగైనా ఐపిఎల్ లో ఆడాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు. గత 13 సీజన్ లపాటు అభిమానులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళుతోంది. 2021 లో ఐపిఎల్ 14 వ సీజన్ కూడా కరోనా కారణంగా అత్యంత పటిష్టమైన భద్రతల నడుమ ఇండియాలో మినిమం వేదికల్లో చేయడం జరిగింది. కానీ సరిగ్గా 25 మ్యాచ్ లు జరిగిన అనంతరం ఒక పొరపాటు కారణంగా కరోనా వైరస్ కొంతమంది ఆటగాళ్లకు సంక్రమించింది. ఇక విధిలేని పరిస్థితుల్లో అప్పటికి ఐపీఎల్ 14 ను వాయిదా వేయడం జరిగింది.
కానీ దాదాపుగా రద్దు చేయాలని అధిక సంఖ్యలో కామెంట్స్ వచ్చినా బీసీసీఐ ఐపీఎల్ సీజన్ 14 ను సెప్టెంబర్ 19 నుండి జరిగేలాగా ప్లాన్ చేసింది. అలా ఇంకో అయిదు రోజుల్లో ఐపీఎల్ యూఏఈ మరియు ఒమన్ లు వేదికలుగా ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందుగానే విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ పేజ్ 2 లో పాల్గొనేది లేదని ప్రాంచైజీలకు షాక్ ఇస్తున్నారు. అయితే దీనికి కారణాలు ఏవైనా కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమవుతుండడం కొన్ని జట్లకు ఇబ్బంది కలిగే అవకాశం లేకపోలేదు. దాదాపుగా ప్రతి జట్టు నుండి ఎవరో ఒకరు కీ ప్లేయర్ దూరమవడం టైటిల్ గెలవడానికి గల అవకాశాలను దూరం చేస్తాయి. కానీ డిపెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ జట్టుకు ప్లేయర్స్ బెడద లేదు. అందరూ టోర్నీలో పాల్గొననున్నారు. ఈ తీరం లో కీ ప్లేయర్స్ గా కొనసాగుతున్న డికాక్, పొలార్డ్, క్రిస్ లిన్, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ మరియు కోల్టర్ నైల్ లు ఐపీఎల్ 14 ఫేజ్ 2 లో ఆడనున్నారు.
కాబట్టి వీరిపై ఎటువంటి ఒత్తిడి ఉండబోదు. ఇక ఎలాగు జట్టును సక్సెస్ ఫుల్ ముందుండి నడిపించడానికి సారధి రోహిత్ శర్మ ఉన్నాడు. గెలుపు గుర్రాలు బుమ్రా, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ మరియు సూర్య కుమార్ యాదవ్ లు ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన ఏడు మ్యాచ్ లలో కనీసం 4 గెలిచినా ప్లే ఆప్స్ కు అర్హత సాధిస్తుంది. మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే మళ్ళీ టైటిల్ ను గెలిచే సత్తా రోహిత్ సేనకు ఉందని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: